– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పర్ణిస్థితి లేదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో ఆయన బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి ఓట్లను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)కు మధ్య ఎలాంటి అవగాహనా ఒప్పందం జరగలేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే అవగాహన కుదిరిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతోపాటు జూబ్లీహిల్స్‌లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





