యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్‌ పరిశీలించిన మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : సనత్‌నగర్ టిమ్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం పరిశీలించి పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆరఅండ్‌బి, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఎ, బీ, సీ బ్లాకులన్నీ కలియతిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆరఐ, ల్యాబులు, మెకనైజ్‌డ్ లాండ్రీ, కిచెన్ తదితర అన్ని విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని మంత్రి సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్లు పెంచాలని సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘జూన్‌లో ఈ టిమ్స్‌ను ప్రారంభిస్తాం.. వైద్య సేవల ట్రయల్ రన్ విజయవంతంగా జరుగుతోంది.. కొన్ని పనులు తుది దశలో ఉన్నాయి.. వాటిని గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం.. ఇది వెయ్యి పడకల హాస్పిటల్.. ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయి.. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం.. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంటుంది.. ఇక్కడే అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *