-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్
-26,519మందికి ఊరట
-గత ప్రభుత్వంలోని పెండిరగ్ బిల్లులను సైతం క్లియర్ చేసిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండిరగ్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు. గత ప్రభుత్వం కాలంలో 04- 03- 2023 నుంచి 20-06-2025 వరకు పెండిరగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది.