నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయోనన్న అంశంలో బలమైన వాదనలు వినిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలువరిస్తామన్నారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రమంజిల్ కాలనీలోని నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. బనకచర్లతో తెలంగాణకు కలగనున్న ముప్పును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలసి ఈనెల 19న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌కు సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రాష్ట్ర నీటి కేటాయింపులపై ప్రభావం చూపుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని నివేదికను తిరస్కరించాలని కోరామన్నారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణా ప్రయోజనాలకు జరిగే నష్టంపై ఈ నెల 30 ప్రజాభవన్ ో మద్యాహ్నం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలపై ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన నివేదికలపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ధరణ పనులపై ఎన్‌డిఎస్‌ఏ ఇచ్చిన ఆదేశాలను సత్వరమే అమలులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలన్నారు. డిరడి ప్రాజెక్ట్‌పై ఆయన మాట్లాడుతూ భూసేకరణ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్.ఎల్.బి.సి)పనుల పురోగతి పై సమీక్షించిన ఆయన పునరుద్ధరణ పనుల కోసమై అంతర్జాతీయస్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామన్నారు.
నీటిపారుదల శాఖలో పెండిరగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీల తంతును వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజిలను రూపొందించే అంశలపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఇఎన్‌సి మహమ్మద్ అంజత్ హుస్సేన్, ఇఎన్‌సి ఓ అండ్ ఎం డిప్యూటీ ఇఎన్‌సి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు