హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని పంచాయతీరాజ్ , గామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి పూర్తిస్థాయిలో విచారణ జరిపి దాడికి గల కారణాలను గుర్తించి బాధ్యులను శిక్షించాల్సిందిగా ఆదేశించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విలేకరుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. బాధిత విలేకరికి అన్ని విధాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క
