– లోక్‌సభలోనూ ఆమోదం పొందిన బిల్లు
న్యూదిల్లీ, జూలై 30: వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఇది చట్ట రూపం దాల్చనుంది. ప్రతిపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ నేడు మూజువాణి వోటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించేలా నేషనల్ ఆనర్ యాక్ట్-1971 చట్టంలో మార్పుల కోసం కేంద్రం తాజా బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని అవమానించిన వారికి ప్రస్తుతం గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇకపై జాతీయ గేయాన్ని అవమానించిన వారికి కూడా ఇదే శిక్ష పడేలా చట్టంలో మార్పులు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన ఈ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్‌ఖ్తెన నేపథ్యంలో కేంద్రం ఈ గేయానికి మరిన్ని రక్షణలు కల్పిస్తూ తాజా బిల్లును తీసుకొచ్చింది. బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో ఈ గేయాన్ని రచించారు. ఆనంద్‌మఠ్ నవలలో భాగంగా తొలిసారి 1882లో ఈ గేయం ప్రచురితమైంది. ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గేయం ఆలాపనకు సంబంధించి కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. రాజ్యసభలో ఈ బిల్లును జులై 24న ప్రవేశపెట్టగా జులై 29న ఆమోదం లభించింది. నేడు లోక్‌సభ కూడా బిల్లుకు ఆమోదం తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనల నడుమ రెండు సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


