– సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం
వాషింగ్టన్, మే 27: అమెరికా`ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో శత్రుత్వం నేపథ్యంలో పాకిస్థాన్ నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించలేదని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాకిస్థాన్ ఆసక్తి కనబరచలేదు. అబ్రహం ఒప్పందాల్లో చేరేది లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్‌పై గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశం మధ్యవర్తిగా వ్యవహరించడం మరింత సమస్యాత్మకం’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ సుదీర్ఘ కాలంగా ద్వేషంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో పాక్ ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని ట్రంప్ ఇచ్చిన పిలుపునకు పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలి. పాక్ ఎయిర్‌బేస్‌లో ఇరాన్ సైనిక విమానాలు పార్క్ చేసి ఉన్నట్టు ఇటీవల వచ్చిన వార్తలు అవాస్తవాలని కొట్టిపారెయ్యలేం’ అని గ్రాహం పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




