– అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచన
న్యూదిల్లీ, మే 27: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్ప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో అవసరం లేకుండా బయట తిరగరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాసు నీరు అందించాలని, ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టి కుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతరులకు తాగునీరు అందించే వారిని అభినందిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




