– తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరి మృతి
– వందమందకి పైగా భక్తులకు గాయాలు
పూరీ, జూలై 16: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్ రోడ్డులో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించారు. జాతీయ డియా కథనాల ప్రకారం, రద్దీ విపరీతంగా పెరగడంతో ఓ వ్యక్తికి ఊపిరాడక స్పృహ తప్పిపోయినట్టు తెలిసింది. వెంటనే ఆ వ్యక్తిని పూరీ జిల్లా హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు అయితే, ఈ విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు, రద్దీ ఎక్కువైన ప్రాంతంలోని మిగిలిన వారిని సహాయక సిబ్బమది తక్షణం తరలించారు. సుమారు 120 మందిని హాస్పిటల్‌లో చేర్చినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో రద్దీ నియంత్రణకు అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్టు సమాచారం. ప్రపంచప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర లక్షల మంది భక్తుల మధ్య గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





