అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 16 : ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారిలోని సంస్థ‌ కార్యాలయంలో శుక్ర‌వారం బ‌తుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కెయు పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి, సంస్థ సిఈఓ రామ్మూర్తి త‌దిత‌రులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుక‌ల‌ను  ప్రారంభించారు. మహిళలు, సిబ్బంది పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని  ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక బతుకమ్మ అని, ప్ర‌కృతిని, పూల‌ను సైతం దేవ‌త‌గా కొల‌వ‌డం ఈ పండుగ ప్ర‌త్యేక‌త అని అన్నారు. మహిళలు తమ పసుపు కుంకుమల కోసం గౌరమ్మని ఎంతో భ‌క్తితో పూజిస్తార‌ని తెలిపారు. కాగా, మహిళల కోలాటం, డాన్సులు, బతుకమ్మ పాటలు ఎంతో అలరించాయని డాక్టర్ అనితా రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో  రామ్మూర్తి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *