– యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 6: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మున్సి పల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించి పరిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మినీ మీటింగ్ హల్లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులో రావడం, కుటుంబ సభ్యులకు వేరువేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు రెండుమూడు పోలింగ్ కేంద్రాలలో ఉండడం వంటి వాటిపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు. వార్డు వారీగా ప్రచురించిన ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పునః పరిశీలన చేస్తున్నామని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అయన తెలియజేశారు. వీటన్నిటిని ఈ నెల 9 లోపు పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీలు తెలియజేయాలని కోరారు. అక్టోబర్ 1, 2025 ఆధారంగా ఓటరు జాబితాలో అప్డేట్ అయిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీని ద్వారానే తుది జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. వివిధ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ప్రకటించే ముందే వార్డు హద్దులను నిర్ణయించాలని, కొత్తగా ఇంటి నంబర్లు వచ్చినచోట ఓటరు జాబితాలో సరిపోలడం లేదని, ఒక ఇంట్లో ఓట్లు వేరే వేరే వార్డుల్లో ఉన్నాయని, అలాగే డబుల్ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని కోరారు. ఇళ్లల్లో ఉన్న వారికి రెండుమూడుచోట్ల ఓట్లు ఉన్నాయని, అలాంటి వాటిని తొలగించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తరపున వెంకటేష్, కిష్టయ్య , ఆర్.ఎస్ తరపున ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ తరపున బట్టు రామచంద్రయ్య, మహేందర్, బలరాం, సిపిఐ (ఎం) తరపున బట్టుపల్లి అనురాధ, ధనలక్ష్మి బిఎస్ పి తరపున నాగేష్,, టిడిపి తరపున చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





