ఇపుడు సీఎన్‌జి వంతు

– నాలుగోసారి ధరలు పెంచిన కేంద్రం

న్యూదిల్లీ, మే 26 : కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.2లు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్‌జీ ధరలను పెంచడం ఈనెల 15 నుంచి పదకొండు రోజుల్లో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 15న మొదట కిలోకు రూ.2 పెంచగా అనంతరం రెండుసార్లు రూపాయి చొప్ప్పున కేంద్రం పెంచింది. తాజాగా మరో రూ.2లు పెంచింది. మొత్తం రూ.7ల వరకు ధరలు పెరగడంతో వాహనదారులు, ఆటో, క్యాబ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. సోమవారం పెట్రోల్‌పై లీటరుకు రూ.2.61, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.71 చొప్ప్పున ధరలు పెరిగాయి. తాజా పెంపుతో 15 నుంచి లీటరుకు మొత్తం పెంపు రూ.7.5లకు చేరింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *