ట్రంప్‌ ‌మెడకు లైంగిక వేధింపుల కేసు

– దోషిగా తేల్చిన అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు
– కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు 5 మిలియన్‌ ‌డాలర్లు చెల్లించాలని ఆదేశం

వాషింగ్టన్‌,‌ జూలై 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు దోషిగా తేల్చింది. రచయిత్రి, మాజీ కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు 5 మిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లు అంటే దాదాపు రూ.47 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2023లో విచారణ జరిపిన జ్యూరీ ట్రంప్‌ ‌లైంగిక దాడికి పాల్పడినట్లు, అనంతరం క్యారల్‌ ‌పరువును దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినట్లు తేల్చింది. దీంతో 5 మిలియన్‌ ‌డాలర్ల పరిహారం చెల్లించాలని అప్పుడే తీర్పు వెలువరించింది. లైంగిక దాడికి గాను 2 మిలియన్‌ ‌డాలర్లు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు గాను 3 మిలియన్‌ ‌డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ మే 2023లో కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్‌ ‌చేసిన అప్పీలును విచారించడానికి గత వారం అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. 1996లో న్యూయార్క్‌లోని ఒక డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లోని డ్రెస్సింగ్‌ ‌రూమ్‌లో తనపై ట్రంప్‌ ‌లైంగిక దాడి చేశారని క్యారల్‌ ఆరోపించారు. ఆ విషయాన్ని 2019లో ప్రచురితమైన ఓ పుస్తకంలో రాశారు. ఆ ఆరోపణలు పూర్తిగా కల్పితమని, క్యారల్‌ ఒక పిచ్చిదని ట్రంప్‌ ‌కొట్టిపడేశారు. కాగా, ఇది ట్రంప్‌నకు సంబంధించిన ఏకైక సివిల్‌ ‌కేసు కాదు. 2024లో పరువు నష్టం కేసులో క్యారల్‌కు అదనంగా 83.3 మిలియన్‌ ‌డాలర్లు చెల్లించాలని మరో జ్యూరీ తీర్పు ఇచ్చింది. ఆ కేసు కూడా ప్రస్తుతం న్యాయపరమైన పక్రియ కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *