– ‘ఎక్స్’ వేదికగా రాహుల్ ఆరోపణలు
న్యూదిల్లీ, జూలై 8: నీట్-యూజీ పరీక్షపై వివాదం కొనసాగుతుండగానే యూజీసీ-నెట్ సోషియాలజీ ప్రశ్నపత్రంపై మరోసారి లీక్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ’ఎక్స్’ వేదికగా చేసిన ఆరోపణలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. యూజీసీ-నెట్ పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ ఒకటి బయటకు వచ్చిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. అందులో సుమారు 90 ప్రశ్నల వరకు ఒరిజినల్ సోషియాలజీ క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలతో సరిపోలాయన్నారు. ఈ ప్రశ్నపత్రం బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లో సుమారు రూ.2.25 లక్షలకు అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. ఇదే నెట్‌వర్క్ సీఎస్‌ఐఆర్-నెట్, హెచ్‌టీఈటీ, ఏడీఏ వంటి పరీక్షల ప్రశ్నపత్రాలను కూడా సరఫరా చేస్తోందనీ రాహుల్ పేర్కొన్నారు. గత జూన్ 30న జరిగిన ఈ ప్రశ్నపత్రం పరీక్షకు ముందే లీకైందని వచ్చిన డియా కథనాలనూ ప్రస్తావించారు రాహుల్. కాగా.. రోహ్‌తక్(హరియాణా)లో ఇద్దరు విద్యార్థి నాయకులు ఓ వీడియోనూ పోస్ట్ చేస్తూ.. పరీక్షకు ముందే బోధించిన 2 ప్రశ్నపత్రాల సెట్లలో ఒకటి అసలు దానితో సరిపోలుతోందని పేర్కొన్నారు. కాగా.. ఈ పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు ప్రశ్నపత్రంలో అనేక అక్షర, వ్యాకరణ దోషాలు సహా క్లారిటీలేని ప్రశ్నలున్నాయనే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కొందరు పలు ఉదాహరణలను కూడా సోషల్ డియాలో పంచుకున్నారు. ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్తల పేర్లను తప్పుగా ముద్రించడం సహా సంబంధంలేని ప్రశ్నలను అడిగారని వారు పేర్కొన్నారు. మొత్తం 150 ప్రశ్నల్లో కనీసం 67 ప్రశ్నలు గతంలో నిర్వహించిన 2024 పరీక్షలో వచ్చిన వాటితో పోలి ఉన్నాయని, కనీసం బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాల క్రమమూ మారలేదని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలపై జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





