– ఇరాన్, అమెరికాల మధ్య పరస్పర దాడులు
– అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులు
– బహ్రెయిన్, కువైట్‌లపై దాడులు
టెహ్రాన్, జులై 8: పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్.. ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్‌లో అమెరికాకు చెందిన 85 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీనిపై ఐఆర్‌జీసీ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని ఆరోపించింది. దీనికి తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని, అందుకే ఈ తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. బహ్రెయిన్ లోని యూఎస్ ఫిఫ్త్ ప్లీట్, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ సహా అగ్రరాజ్యానికి చెందిన 85 కీలక మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. వాటిపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. బుషెహర్‌లో అమెరికా అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ-9ను కూల్చినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతోన్న వేళ ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై ఐఆర్‌జీసీ స్పందిస్తూ.. తమ చారిత్రక కార్యక్రమాన్ని మరుగున పడేసేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. తాజా దాడులపై ఇరాన్ స్పీకర్ ఘాలిబఫ్ సోషల్ డియాలో పోస్ట్ చేశారు. వేధింపులు, బెదిరింపుల శకం ముగిసింది. ఇక మేం తలొగ్గబోం. అమెరికా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఆ దేశం ఎంత ఒత్తిడి చేసినా.. టెహ్రాన్ లొంగిపోదని రాసుకొచ్చారు. ఇరాన్‌పై ఈసారి అతిపెద్ద దాడి జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దాదాపు 80కి పైగా లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసినట్లు తెలిపింది. టెహ్రాన్ కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, కోస్టల్ రాడార్ సైట్లు, యాంటీ షిప్ మిసైల్ సామర్థ్యాలు, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ దాడుల్లో ఐఆర్‌జీసీకి చెందిన 60 చిన్న బోట్లు ధ్వంసమైనట్లు వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కియేలో ఉన్నారు. అక్కడి నుంచే ఇరాన్‌పై తాజా దాడులకు ఆయన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మొత్తంగా అమెరికా,ఇరాన్ పరస్పర దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసింది. హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. ఈమేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు ఇరాన్ మూల్యం చెల్లించుకునేలా.. అమెరికా దళాలు ఈ దాడులు చేపట్టాయని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్‌ల ప్రయోగ స్థావరాలను తమ సేనలు లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసినట్లు చెప్పారు. ఖేష్మ్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ డియా తెలిపింది. ఈ దాడులకు ముందే చమురు విక్రయాలకు సంబంధించి ఇరాన్ లైసెన్స్‌ను అమెరికా రద్దు చేసింది. హర్మూజ్‌లో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కావని, అందుకే లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. ఈ చర్యను ఇరాన్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీని పర్యవసానాలకు అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. ఇకపోతే బహ్రెయిన్, కువైట్‌పై బుధవారం ఇరాన్ దాడులు చేసింది. బహ్రెయిన్‌లో మిస్సైల్ అలర్ట్ సైరన్ మోగించారు. ఇరాన్‌పై మంగళవారం అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో.. కౌంటర్‌గా ఇరాన్ అటాక్ చేసింది. అలర్ట్ సైరన్ మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ ప్రకటన చేసింది. బహ్రెయిన్‌లో కానీ, కువైట్‌లో కానీ డ్యామేజ్ అయినట్లు ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. తాజాగా హోర్ముజ్ జలసంధిలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఆ దాడులకు బదులుగా శక్తివంతమైన రీతిలో అమెరికా ప్రతిదాడి చేసింది. సుమారు 80 టార్గెట్లను ధ్వంసం చేశామని, దీంట్లో ఐఆర్జీసీకి చెందిన 60 బోట్లు ఉన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఖాసిమ్ దీవి, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలపై దాడులు జరిగినట్లు ఇరానీ డియా తెలిపింది. స్థానిక ప్రజలు గాయపడినట్లు తెలిసింది. అయితే హోర్ముజ్‌లో మూడు ట్యాంకర్లపై దాడికి తామే బాధ్యులమని ఇరాన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





