గేమ్ ఛేంజర్ కాదు.. తెలంగాణ లూటర్

– తెలంగాణ సొమ్మును కేరళలో ఖర్చు చేశారు
– మీరు ప్రచారం చేసిన ఇతర రాష్ట్రాల్లో గెలవలేదేమి?
– సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి ధ్వజం
– అభివృద్ది, జాతీయవాదానికి ప్రజలు పట్టం కట్టారు
– బెంగాల్‌లో ఫలించిన జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు
– కేటీఆర్, రేవంత్ చీకటి దోస్తులు
– అందుకే కేటీఆర్ అవినీతి కేసులను అటకెక్కిస్తున్నారు

కరీంనగర్, ప్రజాతంత్ర, మే 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదు.. తెలంగాణ లూటర్ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ సొమ్మును దోచుకుని కేరళ ఎన్నికల్లో ఖర్చు చేశారని మండిపడ్డారు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు కదా అక్కడెందుకు గెలవలేదు అని ప్రశ్నించారు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే రాహుల్ గాంధీ పప్పు సుద్దేనా అని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. బీజేపీ మÖడు రాష్ట్రాల్లో గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది త్రిమూర్తుల (మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్) విజయమని అభివర్ణించారు. బీజేపీ సైద్దాంతిక విజయమిది అంటూ అభివృద్ధి, జాతీయవాదానికి ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  మోదీపట్ల ప్రజల నమ్మకం మరింత పెరిగిందనడానికి ఫలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు దోహదపడతాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనం. హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి గతంకంటే ఎక్కువ సీట్లతో అధికారం చేపట్టబోతోంది. బెంగాల్‌లో 200 సీట్లకుపైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుండటం సంతోషం అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులతో గెలవాలని టీఎంసీ చూసింది. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. వాళ్ల ఇండ్లను ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రిని గూండా అని దుష్ప్రచారం చేశారు. టీఎంసీ ఎన్ని అరాచకాలు చేసినా దాడులను ఎదుర్కొని పోరాడిన బీజేపీ కార్యకర్తల త్యాగాలు ఫలించాయి. రాష్ట్రపతి, ప్రధానిని అవమానించిన టీఎంసీని అక్కడి ప్రజలు ఛీత్కరించారు. మమతా బెనర్జీ మళ్లీ గెలుస్తుందని విశ్లేషకులు వేసిన అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు ఫలించాయి. అందరి అంచనాలు తారుమారు చేస్తూ హిందూ ఓటు బ్యాంకు ఏకమై బీజేపీని గెలిపించాయి. తమిళనాడు ఎన్నికల్లో గెలిచేందుకుఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని చీల్చే కుట్రలు చేశారు. స్టాలిన్, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా అక్కడి ప్రజలు చెంప చెళ్లుమన్పించారు. చివరకు స్టాలిన్ పోటీ చేసిన చోట కూడా ఓడించారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. దేశాన్ని విభజించాలనుకుంటే ఏ విధంగా గుణపాఠం చెబుతారో తమిళనాడు ప్రజలు నిరూపించారు. కేరళంలో కాంగ్రెస్ గెలిచినా ఇండి కూటమి నిలువునా చీలిపోయింది. అక్కడ సీపీఎం, కాంగ్రెస్ మధ్య యుద్ధం జరిగింది. బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య తిరుగుబాటు జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటివరకు 99 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైంది.. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని సంజjáYT వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు దిక్కులేదు కానీ ఇక్కడ ప్రజల సొమ్ము తీసుకుపోయి కేరళలో ఖర్చు చేశారన్నారు.. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే చేశారు. ఆయనకు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. దేశంలో అసోం నుండి బెంగాల్‌కు కాషాయ గాలి వీచింది.. బెంగాల్ నుండి తెలంగాణకు కాషాయ గాలి వీచడం ఖాయం.. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం అన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత తొలిసారి తెలంగాణకు పీఎం వస్తున్నరు. ప్రతి ఒక్కరూ పరేడ్ మైదానానికి రావాలని కోరుతున్నా.

బీఆర్ఎస్‌కు మనుగడ ప్రశ్నార్థకమే

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నది కేసీఆర్.. అదే జరిగితే హరీష్ రావు ఊరుకుంటారా.. ఇప్పటికే కూతురు బయటకొచ్చి పార్టీ పెట్టారు.. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకమే అని బండి సంజjáYT వ్యాఖ్యానించారు. తాను రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదని కేటీఆర్ చెప్పడం జోక్ అంటూ కాందిశీకుల భూముల వ్యవహారంపై నాపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ మనిషి పుట్టుక పుడితే ఆ ఆధారాలను 48 గంటల్లో బయటపెట్టాలి. లేకపోతే చీమకంటే హీనమైన బతుకు కేటీఆర్‌ది అని ఊరూవాడా ప్రచారం చేస్తా.. నిన్ను కరీంనగర్‌లో అడుగుపెట్టనీయం అని హెచ్చరించారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఇద్దరి ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా అంటూ కాందిశీకుల భూముల వ్యవహారంలో తాను అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. లేనిపక్షంలో కేటీఆర్ బతుకును బజారుకీడుస్తా అని సవాల్ చేశారు. కేటీఆర్.. ఫాల్తు రాజకీయాలు మానుకో అని హితవు పలికారు. రేవంత్, కేటీఆర్ ముమ్మాటికీ దోస్తులే. అందుకే డ్రగ్స్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఈ-ఫార్ములా సహా అన్ని స్కాంలను అటకెక్కించారు. మీ ఇద్దరి చీకటి దోస్తీ వ్యవహారాలను త్వరలో నేనే బయటపెడతా అని కేంద్ర మంత్రి బండి హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *