– ఏసీబీకి చిక్కిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :ఇంటి నిర్మా ణానికి అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెం ట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి శ్రీలత సోమవారం బాధితుడి నుం చి రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇంటి నిర్మాణానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకునే దశ నుంచి దానిని ప్రాసెస్ చేసి, గృహ నిర్మాణ అనుమతిని అందజేసే దశ వరకు జూనియర్ అసిస్టెంట్ మొత్తం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా యూసుఫ్గూడ చెక్పోస్టు వద్ద రూ.లక్షా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడి నందుకు ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



