– హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 17: హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మల్లన్నసాగర్ జలాశయం నుంచి రోజుకు అదనంగా 25,30 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీలు) నీటిని తరలించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు నిర్ణయించింది. సింగూర్, మంజీర జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతోంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా మల్లన్నసాగర్ నీటిని హైదరాబాద్‌కు మళ్లించేందుకు సుమారు 4 కిలోటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు లభించాయి. ఈ పనులను 50 నుంచి 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశిరచారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగినా నగరంలో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ జల వనరులను వినియోగించేందుకు జలమండలి కార్యాచరణ చేపట్టింది. అలాగే నగరానికి అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రోజువారీ అవసరాలు, భవిష్యత్ డిమాండ్‌పై సమగ్ర అంచనా వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





