– ధరణి అక్రమాలపై ‘సిట్’ విచారణ
– తాగునీటికి ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
– నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
– ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచన
– శాస్త్రవేత్తలతో ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక
– కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
కైహైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్నినో కంటింజె న్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదా పు 40 శాతం వర్షపాతం లోటు ఉంది. తాగునీ రు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా పై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణా ళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని నిర్ణయించింది. ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తితోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగును ఆపి తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ఎల్ నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవే
త్తలతో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన పంటలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, పంటలతో పాటు పశువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్య
లతో నివేదిక అందించాలని కోరింది. అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలోఉన్న పరిస్థితులు, వెంటనే చేపట్టాల్సిన చర్యలను తెలుసుకునేందు
కు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ సోమవారం ఉమ్మడి జిల్లాల
వారీగా జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో అక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణ
యించింది. ప్రతి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రితో పాటు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
ఈ ప్రకృతి గండం నుంచి గట్టెక్కేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, సమన్వయం
తో పనిచేసి వర్షాభావ సంక్షోభాన్ని అధిగమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల రికార్డులు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్లో దాదాపు 10 వేలకుపైగా లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అను మతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ఈ రోజు మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్) పాత్రతో పాటు, పోర్టల్ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్ ప్రక్రియ, వెండర్కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్ రూపకల్పన, సిస్టమ్ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరణిలో పోర్టల్ తర్వాత కొన్ని మాడ్యుల్స్ మార్చి రైతులకు ఉపయోగంగా ఉండేలా మా ప్రభు త్వం భూభారతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటికీ ఆనాడు సాఫ్ట్ వేర్ రూపకల్పన చేసిన పోర్టల్ లో ఉన్న లోపాలతో అవకతవకలు వెలు గులోకి వస్తున్నాయి. అందుకే ధరణి వ్యవహారంలో బాధ్యులు ఎం తటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సిట్ వేసి బాధ్యులను గుర్తించాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టే ఇంజినీరింగ్ పనుల్లో అప్రైజల్ నుంచి ప్రాజెక్టు ప్రపోజల్, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపు విధివిధానాలన్నింటికీ ఒక యూనిఫైడ్ విధానాన్ని రూపొందిం చాలని కేబినేట్ నిర్ణయించింది. సీఎస్ అధ్వర్యంలో వీటన్నింటి సమగ్ర సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల రూపకల్పన, భూసేకరణ, ల్యాండ్ అసెంబ్లీ, కొనుగోళ్లు, కాంట్రాక్టు నిర్వహణ వరకు అన్ని దశలను పరిశీలించేలా నిర్దిష్ట విధివిధానాలతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికైన సంస్థల్లో ట్రాన్సెజెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు మున్సిపాలిటీస్ చట్టం-2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలి పింది. ప్రస్తుతం గ్రామపంచాయతీలకు అందే నిధులను ట్రెజరీ లో జమ చేసే నిబంధనను మార్చి సమీపంలో ఉన్న జాతీయ బ్యాం కులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





