బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం

– గర్భం దాల్చిన బాలిక.. తల్లిదండ్రుల ఫిర్యాదు
– ఇద్దరు యువకులపై ఫోక్సో కేసు

నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 17: ఇద్దరు యువకులు ఓ బాలికను బెదిరెంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. నల్లగొండ జిల్లాలో జ‌రిగిన‌ ఈ దారుణంపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుముల మండలంలోని ఓ గ్రామానికి చెందిన పాఠశాలకు వెళ్లే బాలికను తొలుత ఓ యువకుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత మరో యువకుడు కూడా బెదిరింపులకు దిగాడు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాల్సిందేనని హెచ్చరించాడు. ఆపై అతను కూడా బాలికపై  లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత చిన్నారి గర్భం దాల్చింది. విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను గట్టిగా నిలదీయగా అసలు విషయాన్ని ఆమె వెల్లడించింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *