ఆయిల్‌ ‌పామ్‌ ‌కోసం ఏకమవుదాం

– కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం రండి
– దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు తుమ్మల లేఖ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడికి దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని కోరారు. ప్రధాని మోదీని కలిసి ఆయిల్‌ ‌పామ్‌ ‌రైతుల సమస్యలు వినిపిద్దామన్నారు. ఆయిల్‌ ‌పామ్‌కు కనీస హా ధర రూ.25 వేలుగా నిర్ణయించాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే క్రూడ్‌ ‌పామ్‌ ఆయిల్‌ ‌దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలన్నారు. దిగుమతి సుంకాల తగ్గింపుతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దేశ ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగులో 75 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే అని చెప్పుకొచ్చారు. రైతులకు స్థిర ఆదాయం కోసం కేంద్రం తక్షణ జోక్యం అవసరమన్నారు. వంటనూనెల స్వయం సమృద్ధి లక్ష్యానికి రైతుల రక్షణ కీలకమన్నారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌రైతుల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలు కలిసిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *