యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు ఉండవు

– కమ్యూనిస్టుల అబద్ధాల ప్రచారం తగదన్న నిర్మల

న్యూదిల్లీ, ఆగస్టు 11: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇలాంటివి ప్రచారం చేయడంలో ముందుంటారని ఎద్దేవా చేశారు. వీటిని ఉపయోగించే వినియోగదారుల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోరన్నారు. కొన్ని రకాల లావాదేవీలకు మాత్రs భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని ఇంకా ఖరారు చేయలేదని, తరువాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. చార్జీలు వసూలు చేసేందుకు వీలు కలిగేంచేలా చట్టాన్ని సవరించామే తప్ప వినియోగదారుల నుంచి ఇప్పటికిప్పుడు వసూలు చేయడానికి కాదని చెప్పారు. ఏ వస్తువుపై ఎండీఆర్ వసూలు చేయాలి.. ఎంత ధరకు పరిమితం చేయాలన్న దాన్ని తరువాత నిర్ణయిస్తామని తెలిపారు. యూపీఐ విధానాన్ని 2016లో ప్రారంభించగా అప్పటినుంచి ఉచితంగా సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. అది కొనసాగుతుందని తెలిపారు. చిరు వ్యాపారులపై భారం పడబోదన్నారు. అమెరికా ఒత్తిడి మేరకే యూపీఐ చెల్లింపులపై రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారని సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ‘కమ్యూనిస్టులే అంత.. వాస్తవాలు చెప్పరు. ఆపై వక్రీకరణలు’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *