2029లో జమిలికి నో చాన్స్‌..

“అన్ని సాఫిగా సాగుతున్న టైంలో బీజేపీపై బొద్దింకలు వచ్చి పడ్డాయి.ప్రభుత్వానికి ఊహించని షాక్‌ ఇచ్చింది. కాషాయ వ్యూహాలకు చెక్‌ పెట్టుతున్నాయి. యువతలో పేపర్‌ లీక్‌లు, నిరుద్యోగం, అసంతృప్తి, పేద మధ్య తరగతి ప్రజలపై ధర భారాన్ని కాక్రోచ్‌లు కన్సాలిడేషన్‌ చేశారు. రైతులు, యువత, కార్మికులతో కలిసి ఒకే బలమైన రాజకీయేత ప్రతిపక్షంగా వ్యవస్థగా ఎదిగింది. బీజేపీ ఉత్తరాదిలోనే బలం ఎక్కువ. కుల మత రాజకీయాలతో స్ట్రాంగ్‌గా ఉంది. అయోధ్యలో రాముడి సోమ్మును దోచుకోవడం సహా అనేక కారణాలతో యువతలో వ్యతిరేకత ఏర్పడింది. ఏ మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందో దాన్ని అయోధ్య నిధుల గోల్ మాల్‌ కోలుకోలేని దెబ్బ తీసింది.నార్త్ వోటర్ల బీజేపీకి దూరమయ్యారు.”

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్లేనా..?
జెన్‌ జీల పోరాటం తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్‌, డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ల అమలుపై అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంటే, యువత అనూహ్యంగా పోరాటం కాషాయ పార్టీ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు కనిపిస్తుంది. వికసిత్‌ భారత్‌, పేరుతో 2047 లక్ష్యంగా ముసుగులో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీజేపీ జమిలి ఎలక్షన్‌ అంశాన్ని గత మూడేళ్లు చర్చలో పెడుతోంది. దీని కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ నేతృత్వంలో కమిటీని కూడా మోదీ  ప్రభుత్వం నియమించి నివేదిక తీసుకుంది. జమిలి ఎన్నికలకు రాజ్యాంగ, న్యాయ, సవరణలు అవసరం. ఈ అడ్డంకులను అధికమించేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.ఉభయ సభల్లో మేజార్టీ కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. జమిలిపై ప్రతిపక్షంలోనే కాదు ఎన్డీయేలో కూడా భిన్నాభి ప్రాయాలుండటంతో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చుతూ కాషాయ పార్టీలో విలీనం చేస్తూ మోషాలు రాజకీయ ఏకీకరణ యజ్ఞనం చేన్నారు. బీజేపీకి రాష్ట్రాల్లో షాడో యూనిట్స్‌గా మార్చుకుంటుంది..లోక్‌ సభలో ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో లేదు, ప్రతిపక్ష ఇండి కూటిమికి బలం ఉంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యంగ సవరణ బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందిన రాజ్యసభలో గట్టెక్కే పరిస్థితి లేదు. బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి లోకల్ పార్టీల విచ్చిన్నం చేస్తూ, బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఆప్‌, టీఎంసీ పార్టీలను చీల్చి ఆ పార్టీలను రాజ్యసభ ఎల్పీలను బీజేపీలో విలీనం చేసుకుంది. గతంలో శివసేన, ఎన్‌సీపీని ఇలాగే చేసింది.
అన్ని సాఫిగా సాగుతున్న టైంలో బీజేపీపై బొద్దింకలు వచ్చి పడ్డాయి.ప్రభుత్వానికి ఊహించని షాక్‌ ఇచ్చింది. కాషాయ వ్యూహాలకు చెక్‌ పెట్టుతున్నాయి. యువతలో పేపర్‌ లీక్‌లు, నిరుద్యోగం, అసంతృప్తి, పేద మధ్య తరగతి ప్రజలపై ధర భారాన్ని కాక్రోచ్‌లు కన్సాలిడేషన్‌ చేశారు. రైతులు, యువత, కార్మికులతో కలిసి ఒకే బలమైన రాజకీయేత ప్రతిపక్షంగా వ్యవస్థగా ఎదిగింది. బీజేపీ ఉత్తరాదిలోనే బలం ఎక్కువ. కుల మత రాజకీయాలతో స్ట్రాంగ్‌గా ఉంది. అయోధ్యలో రాముడి సోమ్మును దోచుకోవడం సహా అనేక కారణాలతో యువతలో వ్యతిరేకత ఏర్పడింది. ఏ మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందో దాన్ని అయోధ్య నిధుల గోల్ మాల్‌ కోలుకోలేని దెబ్బ తీసింది.నార్త్ వోటర్ల బీజేపీకి దూరమయ్యారు.
12 ఏళ్లుగా యువతను మోదీని ఆకట్టుకుంటున్నారు, తాజాగా పేపర్‌ లీక్‌లపై యువత పోరాటంపై బీజేపీ చిల్లర కూతలు జెన్‌ జీ మోదీ కి దూరమయ్యారు. దిక్కులేని పరిస్థితిలో యువతను ఆకట్టుకునేందుకు మోదీ  కూడా సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. దేశంలో ఈ పరిస్థితిలో జమిలి ఎన్నికలు బీజేపీకి కత్తిమీద సామే అన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమౌతోంది. రాజకీయ ఏకీకరణతో రాజ్యంగ సవాళ్లను అధికమించి జమిలి ఎలక్షన్‌ నిర్వహిస్తే అది బీజేపీకే నష్టం చేస్తుందని, జెన్‌ జీలు కొత్త ప్రభుత్వాన్వేషణలో ఎన్డీయేను దెబ్బతీసే అవకాశముందని కాషాయ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. అందుకే ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో జమిలిపై అధికార పార్టీ ఎక్కడ చర్చకు పెట్టడం లేదు. డీలిమిటేషన్‌ బిల్లు, మహిళ రిజర్వేషన్లు అమలు చట్టం తీసుకువస్తామని చెప్పిన జెన్‌ జీల పోరాటంతో కేంద్రం మౌనంగా ఉంటుంది.
డీలిమిటేషన్‌, ఉమెన్‌ రిజర్వేన్ల అమలుపై బీజేపే కాదు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. బీజేపీ కుట్ర కంటే తమకు రాజకీయాకాశాలు పెరుగుతాయని, జాతీయ పార్టీలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అది తమకు కలిసి వస్తుందని లోకల్ పార్టీలు అంచనవేస్తున్నాయి. 33 శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలు తమతో ఉంటారన్న భరోసాతో బీజేపీ ఉంది. జమిలిపై, డీలిమిటేషన్‌పై బీజేపీ స్పష్టమైన ఎజెండాతో ఉంది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేరుతో రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంటే, కాంగ్రెస్‌ కు మాత్రం స్పష్టత లేదు. ఇండియా కూటమిలోనే కాదు, ఏఐసీసీ, పీసీసీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్‌కు ఒక స్పష్టమైన అభిప్రాయం లేపోవడంతో డిఫెన్స్‌లో పడుతుంది. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్‌ పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జనాభా ప్రతిపాదితంగా డీలిమిటేషన్‌ ను సౌత్‌లో ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి..50:50 ఫార్మూలాను ప్రతిపాదిస్తూ కేంద్రం లీక్‌లిచ్చినా అనుమానాలు మాత్రం సజీవంగా ఉన్నాయి. ఈ ఫార్మూలతో కూడా ఉత్తరాదికే లాభం జరుగుతుంది..అయితే గుండిలో మెల్లగా సౌత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏఐసీసీకి డీలిమిటేషన్‌పై క్లియర్‌ స్టాండ్ లేనప్పటికీ టీకాంగ్రెస్‌ మాత్రం పునర్విభజన జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఉమెన్‌ రిజర్వేషన్ల వల్ల ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయని పరోక్షంగా రేవంత్ డీలిమిటేషన్‌కు సానుకూలంగా ఉన్నట్లు తన వ్యాఖ్యల్లో స్పష్టమైతోంది. అటు బీఆర్ఎస్‌ మాత్రం జనాభా ప్రతిపాదికంగా డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉందని, దానిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గించడానికి వీల్లేదని వాదిస్తుంది..డీలిమిటేషన్‌పై డీఎంకే స్టాలిన్‌ సౌత్‌ రాష్ట్రాలతో కూటమి కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి కేటీఆర్‌, రేవంత్‌ పాల్గొన్నారు.డీలిమిటేషన్ లో బీజేపీ కుట్రలను ఖండించారు. తర్వాత భేటీ హైదరాబాద్‌ లో నిర్వహిస్తామని రేవంత్‌ ప్రకటించారు. కానీ అది పట్టాలెక్కలేదు. అయితే డీలిమిటేషన్, ఉమెన్‌ రిజర్వేషన్లతో తమకు తెలంగాణలో లాభం జరుగుతుందని అధికార ప్రతిపక్షాలున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటింది. కానీ విభజన చట్టంలోని కీలక అంశాలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. అందులో వాటర్‌ ఇష్యూతో పాటు అసెంబ్లీ స్థానాల పెంపు చాలా ముఖ్యమైనవి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు తమ అసెంబ్లీ స్థానాలను పెంచుకోవచ్చు అనే అంశం ఉంది. విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం, ఏపీ అసెంబ్లీ స్థానాలు 175 నుండి 225కి, తెలంగాణ స్థానాలు 119 నుండి 153కి పెరగాలి కానీ దానిని కేంద్రం అమలు చేయలేదు.తమకు అవసరమైన జమ్ము కాశ్మీర్‌ వంటి చోట్ల అసెంబ్లీ స్థానాలను బీజేపీ పెంచింది కానీ, తెలుగు రాష్ట్రాల్లో పెంచడం లేదు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా డీలిమిటేషన్‌ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు మరింత పెరిగేవి. ఇది తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేసిన అతిపెద్ద రాజకీయ ద్రోహం. ఇప్పటికైనా విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచి,తర్వాత దేశ వ్యాప్తంగా డీలిమిటేషన్‌ ప్రక్రియతో మళ్లీ పెంచాలని తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు డిమాండ్ చేస్తే ఎక్కువ లాభం జరుగుతుంది. అయితే 2029 లో జమిలి ఎన్నికలు నిర్వహించడం పై కేంద్రం , ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేలా ఒత్తిడి తెస్తే  వచ్చే డిలిమిటేషన్ లో తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..సీఎం రేవంత్ బీజేపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..ఈ అవకాశాలను ఉపయోగించుకుని తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి.
తోటకూర రమేష్
        98661 68676

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *