తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆనంద్ డీజీపీగా నియామకం ఖరారైనట్లేనని భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *