– అనుమతి ఇచ్చే వరకు వెళ్లొద్దన భారత నేవీ
– రష్యా చమురు దిగుమతికి బీమా సంస్థల సేవలకు అనుమతి
న్యూదిల్లీ, ఏప్రిల్ 20: హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత పతాక నౌకలకు మన నౌకదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమనుంచి ఆదేశాలు వొచ్చిన తర్వాతే హర్మూజ్‌లో ప్రయాణించాలని నేవీ పేర్కొంది. ఆ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్దారించేందుకే ఈ సూచనలని. లారక్ ద్వీపం హర్మూజ్‌కు సపంలో ఉంటుంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి 11 నౌకలు ఈ జలమార్గాన్ని దాటాయి. దానిని దాటిన చివరి ట్యాంకర్ దేశ్ గరిమ. అదే రోజు జగ్ అర్ణవ్, సన్మార్ హెరాల్డ్ ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనను విదేశాంగశాఖ ఖండించిన సంగతి తెలిసిందే. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి ఈ ఘటనపై నిరసనను తెలియజేసింది. గతంలో తమ దేశానికి బయల్దేరిన అనేక నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిందని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇకపోతే భారత్‌కు చమురు సరఫరాలో ఆటంకాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. తాజాగా రష్యా నుంచి చమురు దిగుమతికి అవసరమైన బీమా సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీనిలోభాగంగా 11 రష్యా బీమా సంస్థలకు భారత్‌లో అనుమతులు మంజూరు చేసింది. వాస్తవానికి ఈ సంస్థలు నౌకా రవాణాలో బీమాలను అందించే పీ అండ్ ఐ క్లబ్స్ (ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ)లో మెంబర్స్ కాకపోవడం గమనార్హం. ఇరాన్-అమెరికా పోటీపడి హర్మూజ్‌ను దిగ్బంధించడంతో చమురు నౌకలు ఈ జలసంధిని దాటడం చాలా కష్టంగా మారింది. మరోవైపు రష్యాకు చెందిన చాలా చమురు నౌకలు ఈ మార్గంలో కాకుండా ఎర్ర సముద్రం దుగా ఆసియాలోని తమ గమ్యస్థానాలకు చేరతాయి. అందుకే భారత్ మాస్కో వైపు మొగ్గు చూపింది. వీటిల్లో గ్యాస్‌ప్రోమ్ ఇన్స్యూరెన్స్, రోస్‌గోస్‌ట్రాక్, బ్యాలెన్స్, సోగ్లాసీ, ఉగోరియా గ్రూప్, స్బెర్‌బ్యాంక్, ఏఎస్‌టీకే బీమా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు గత వారం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కూడా అనుమతులను పొడిగించింది. ఐరోపా కేంద్రంగా పనిచేసే ’ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ పీఅండ్‌ఐ క్లబ్స్’ సంస్థే థర్డ్‌పార్టీ, పొల్యూషన్, కార్గో డ్యామేజ్ వంటివి కవర్ చేస్తూ అత్యధికంగా బీమా పాలసీలు ఇస్తాయి. ప్రపంచ సముద్ర రవాణాలో ఈ సంస్థ వాటా 87శాతం వరకు ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ రష్యా నౌకలకు బీమా పాలసీలు ఇవ్వదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



