రైతు బంధు ఏనాడు స‌మ‌యానికి ఇచ్చారు

– గొప్పలు చెప్పడం కాదు.. తేదీలు సరిచూసుకోండి
– రైతు భరోసాపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదు.. ఐదారె నెలల నెలలపాటు సాగదీసి చెల్లింపులు చేశారు అని మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ధ్వజమెత్తారు. 2018 యాసంగిలో 161 రోజులు పట్టింది.. అంటే 5 నుంచి 6 నెలలు. పంట పండించడానికి కూడా అంత సమయం పట్టదు. 2022-23 యాసంగిలో 148 రోజులు పట్టింది. అంటే 5 నెలలు పట్టింది అని తెలిపారు. గతంలో ఒకే రోజులో వేశాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఒకసారి తేదీలు సరిచూసుకోవాలి అని హితవు పలికారు. ఏకకాలంలో రుణ మాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదని అన్నారు. రైౖతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ పార్టీది.. తాము గత వానాకాలంలో కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు వేశామని తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పుల వల్లే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినప్పటికీ వెసులుబాటును చూసుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణంపై వెటకారంగా మాట్లాడుతున్నారని, ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎత్తేయాలన్న కుట్రతోనే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి కుట్రలను మహిళాలోకం అర్థం చేసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *