పోలీస్ అకాడమీ- ఆస్కీ మధ్య ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంపై తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) హైదరాబాద్ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కీ రిజిస్ట్రార్ సెక్రటరీ ఓ.పి.సింగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు పరస్పర జ్ఞాన మార్పిడి, ఆధునిక పరిపాలనా విధానాలపై అవగాహన, సామర్థ్య నిర్మాణం, నాయకత్వ వికాసం, పరిశోధన, ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ఇతర ప్రయోజనకర కార్యక్రమాలను నిర్వహించేందుకు కలిసి పనిచేయనున్నాయి. పోలీసు అధికారులలో పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరచడం, ఆధునిక పరిపాలనా ఉత్తమ పద్ధతులను పరిచయం చేయడం, సంస్థాగత సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఒప్పందం రెండు ప్రతిష్ఠాత్మక సంస్థల మధ్య దీర్ఘకాలిక, ఫలవంతమైన భాగస్వామ్యానికి నాంది పలుకుతుందని, భవిష్యత్తులో ఉమ్మడి కార్యక్రమాల ద్వారా పోలీసు శిక్షణలో నాణ్యతను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ చేతన, కవిత, వెంకటేశ్వర్లు, కెఅర్‌కె ప్రసాద్, శ్రీరామమూర్తిలు, డిప్యూటీ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, నరహరి, యార్లగడ్డ రాంబాబు, ఆస్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *