ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి త్వరగా ఇవ్వండి

– ఓటర్లకు సీఈవో సుదర్శన్ రెడ్డి సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఎన్యూరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు వెంటనే అందజేసి మీ ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటనలో ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎలాంటి తప్పులు లేకుండా ఫారాలు పూరించి పాస్‌పోర్టు సైజ్ ఫొటో అతికించి బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటరు సంతకం, తేదీతోపాటు బీఎల్‌వోల సంతకం ఉండేలా చూసుకోవాలన్నారు. అందజేసిన రెండు ఎన్యూమరేషన్ ఫారాల్లో ఒకటి బీఎల్‌వోలకు ఇవ్వాలని, మరొకటి ఓటరుY భద్రపరుచుకోవాలని సూచించారు. పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు నమోదు అవుతుందని స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాలో ఓటరు వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అలాంటి వివరాలు లేకపోయినా ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేయాలని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610మంది (49.28%) తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారన్నారు. ‘సర్’ ప్రక్రియ మరో పది రోజుల్లో ముగుస్తుందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *