– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పోషించిన పాత్ర చిరస్మరణీయమని మంగళవారం ఒక ప్రకటనలో కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ముద్రగడ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని భట్టి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించిన విలక్షణ నాయకత్వ లక్షణాలు కలిగిన గొప్ప నాయకుడు ముద్రగడ అని, ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





