త్వరలోనే బిఆర్‌ఎస్‌ ‌నుంచి మరిన్ని చేరికలు

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు
– పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలోకి త్వరలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఒకే పార్టీలో ఉండరని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌ ‌విస్తరణపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు. తనకు, సీఎం రేవంత్‌ ‌రెడ్డికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. అయితే బీఆర్‌ఎస్‌లోని పలువురు కీలక నేతలు బీజేపీలోకి వెళ్తారని ఆయన పేర్కొన్నారు.  ఇక శనివారం నుంచి తాను జిల్లాల పర్యటన చేస్తానని.. అందులోభాగంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని చెప్పారు. అలాగే పార్టీల్లో ఉన్న ఇబ్బందులను సైతం సరి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *