మోదీ ఉపయోగించే విమానం అమ్మేయాలి

– అప్పుడే ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం
– స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు

లక్నో, మే 12: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు ఆపాలని, డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడాలని సూచించారు. కాగా, దుబారా ఖర్చులు చేయవద్దు అంటే ముందుగా ప్రధాని వినియోగించే సుమారు రూ.8 వేల కోట్ల ఖరీదైన ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని అమ్మేయాలని స్వామి అవిముక్తేశ్వరానంద అన్నారు. ఆ విమానానికి బదులుగా ఇంధనం తక్కువ ఖర్చయ్యే విమానాలను వాడాలని సూచించారు. ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు చెప్పడం కాదు.. ముందుగా ఆ విమానాన్ని అమ్మేయాలని ఆయన అన్నారు. యూపీలోని సోన్‌భద్రతలో జరిగిన గోవిష్ట్ యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొదుపు అనేది అధికారంలో ఉన్న వ్యక్తుల నుంచే మొదలు కావాలన్నారు. ధర్మం అనేది ఇంటి నుంచే మొదలు కావాలని అవిముక్తేశ్వరానంద అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *