ఎన్‌డీయే పక్ష ఎంపీలతో మోదీ ‘మంగళ్ మిలన్’

– పార్లమెంటులో అనుస‌రించాల్సిన‌  వ్యూహాలపై దిశానిర్దేశం

న్యూదిల్లీ, జూలై 28 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ’మంగళ్ మిలన్’ జరిగింది. సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు మోదీ సూచించారు. సమావేశంలో ప్రధానంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్(సవరణ) బిల్లు-2026 ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. నేరస్థులకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించడంతోపాటు కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన దానిపై చర్చించారు. ఇక భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూటమి ఎంపీలకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయÖష్ గోయల్ వివరించారు. భారత ఎగుమతుల పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణలో ఈ ఒప్పందాలు కీలకంగా మారాయన్నారు. మత్స్య శాఖకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణ. మత్స్యకారుల ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వివరించారు. మరోవైపు ఈనెల 20న దిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసు చర్యను ప్రశ్నిస్తూ సభను అడ్డుకుంటున్న విపక్షాలకు తగు రీతిలో సమాధానం ఇవ్వాలని ఎన్డీయే నిర్ణయించింది. సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *