ట్రంప్ చెబితే మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

చెన్నై, ఏప్రిల్ 20 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవ ర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడులోని తూత్తుకుడి లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మా ట్లాడుతూ.. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు అకస్మాత్తుగా ఇరాన్పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు మూడు రోజుల ముందే ప్రధాని మోదీ ఇజ్రా యెల్లో పర్యటించారు. ఆయన నెతన్యహూ తో భేటీ అయ్యారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకవేళ ట్రంప్ దూకమంటే, మోదీ దూకేస్తారని అన్నారు. ఇరాన్లో వార్ ప్రారంభంకావడానికి ముందు ట్రంప్ ఆదేశా ల ప్రకారం మోదీ ఇజ్రాయెల్ వెళ్లి వచ్చారని, దానికి కారణం చాలా సింపుల్ అని, ఎప్టోస్టీన్ ఫైల్స్.. అదానీ అని రాహుల్ ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *