9న ప్రధాని మోదీ పర్యటన

– రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు.  పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలు కూడా ఉండే అవకాశముంది. ముఖ్యంగా ఎంఎంటీఎస్  2ను జాతికి అంకితం చేసే అంశం ఈ పర్యటనలో ప్రధానంగా ఉండొచ్చని సమాచారం. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ఈ ప్రాజెక్టు ప్రజా ప్రయాణానికి కీలకంగా మారనుంది. ఎయిమ్స్ బీబీనగర్ హాస్పిటల్‌ను కూడా జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఈ హాస్పిటల్ తెలంగాణతోపాటు సమీప రాష్ట్రాల ప్రజలకు కూడా వైద్యసేవల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇవేకాకుండా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారని సమాచారం. రవాణా, కనెక్టివిటీ రంగాల్లో ఈ ప్రాజెక్టులు కీలకమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరో అంశంగా మల్లారెడ్డి యూనివర్సిటీ పర్యటన కూడా ప్రధాని షెడ్యూల్‌లో ఉండొచ్చని చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభాలు, రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ, ఆరోగ్య రంగంలో కొత్త సదుపాయాలపై కేంద్రీకృతమై ఉండే అవకాశాలు ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *