అందెశ్రీ పార్థివ‌ దేహానికి మంత్రుల నివాళులు

హైదరాబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11: హైదరాబాద్‌లో సోమవారం మృతిచెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు  ఘట్‌కేస‌ర్‌ ఎన్ ఎఫ్ సీ న‌గ‌ర్‌లో మంగళవారం జరిగాయి. ఈ సందద‌ర్భంగా లాలాపేట ఆయన నివాసంలో అందెశ్రీ పార్థివ దేహాన్ని పలువురు సంద‌ర్శించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన పార్థివ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచనఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతతో కలిసి అందెశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అమర్‌ రహే అందెశ్రీ అంటూ నినాదాలు చేశారు. అంతిమయాత్రలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జూపల్లి కృష్ణారావు తదితరులు కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page