– వారిని తక్షణం తొలగించండి
– అర్థరాత్రిళ్లు వారిని పిలిపించుకోవడం ఏమిటి?
– కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి
కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. అర్థరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి మంత్రులను కేబినేట్ నుంచి వెంటనే తొలగించాలని అన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళల నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్. సోమవారం కరీనంగర్‌లో బండి సంజయ్ పర్యటించిన సందర్భంగా డియాతో కేంద్రమంత్రి మాట్లాడారు. మహిళా అధికారులపై కాంగ్రెస్ మంత్రుల వేధింపులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారులని వేధింపులకి గురిచేసిన ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు బండి సంజయ్ కుమార్. రౌడీషీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదా..? అని ప్రశ్నించారు. పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు. తప్పు చేసిన రౌడీషీటర్లకు ఎంఐఎం అండగా ఉంటే వారికే వత్తాసు పలుకుతారా..? అని ఫైర్ అయ్యారు. ఒక వర్గం వోట్ల కోసం ఎంఐఎం నేతల కాళ్లు పట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. మహిళలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు బండి సంజయ్ కుమార్. నెలకు రూ.2, 500లు, తులం బంగారం, స్కూటీపై కాంగ్రెస్ ఇచ్చిన హాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రౌడీషీటర్లు బయటకు రావాలంటేనే గజగజ వణికేలా చేయాలని హెచ్చరించారు. సర్దార్ వల్లభాయిపటేల్ 150వ ఐక్యతా మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పటేల్ చరిత్ర తెలుసుకోవాలని బండి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





