– హరీష్ రావుకు మంత్రి పొన్నం గట్టి సమాధానం
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్27: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కేబినెట్ పై హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. డైవర్షన్ పాలిటిక్స్ ను హరీష్ రావు బంద్ చేయాలని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కంటోన్మెంట్ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని.. ఆటో కార్మికులకు ఇస్తానన్న హాలు నెరవేరుస్తారని బీఆర్‌ఎస్ మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 12000 ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలను ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





