అర్థరాత్రి పేలిన సిలిండర్

– అమ్మమ్మతోపాటు ఇద్దరు పిల్లల సజీవదహనం

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 5 : నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరణించిన వారిని అమ్మమ్మ వనం చంద్రకళ, మనవడు లక్క్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు. పట్టణంలోని కలాల్‌వాడకు చెందిన చంద్రకళ, సైదులు భార్యభర్తలు. చంద్రకళ భర్త అనారోగ్యంతో కొన్ని రోజుల కిందటే మరణించాడు. వారి పెద్ద కూతురు ధనమ్మ భర్త పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటినుంచి తన ఇద్దరు పిల్లలు లక్క్ష్మణ్, ప్రణతితో పుట్టింట్లోనే ఉంటోంది. ఉపాధి నిమిత్తం ఇళ్లలో పనిచేసేందుకు ధనమ్మ మÖడు రోజుల కిందట పుణెకు వెళ్లింది. గురువారం రాత్రి మనవడు, మనవరాలితో చంద్రకళ తమ రేకుల ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్‌సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ముగ్గురూ సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను వెలికితీశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా కాలిన మృతదేహాలను స్థానిక ప్రాంతీయ హాస్పిటల్‌కు తరలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *