హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ధర్నా

– పార్టీ అగ్రనేతల అరెస్ట్ ను ఖండించిన మంత్రి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 22: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరే కంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో  బుధ‌వారం ధర్నాకు దిగారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులను నిరసిస్తూ మహా ధర్నా నిర్వహించారు. దిల్లీలో విద్యార్థులు చేపట్టిన శాంతియుత పార్లమెంట్ మార్చ్‌ పై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొన్నం తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని, ఈ ఘటనల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధర్నాలో అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యక ర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *