– ఎమ్మెల్యే వేముల అందజేత
నిజామాబాద్, ప్రజాతంత్ర, జూలై 22: వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాధితుడి వైద్య చికిత్స కోసం రూ.2,25,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించి, బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మాడవేడి బాలకుమార్ కుటుంబ సభ్యులు తమ క్లిష్ట సమయంలో అండగా నిలిచి, చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు