– కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చికిత్సపై ఆరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





