ఖమ్మం బాలికకు మంత్రి పొంగులేటి ప‌రామ‌ర్శ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆమెకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం ఆ బాలిక హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఆ బాలిక ఆరోగ్య పరిస్దితిని పర్యవేక్షించడంతోపాటు కుటుంబ సభ్యుల బాగోగులను కూడా తెలుసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *