– విదేశీ విద్య కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం
– 1 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 350మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా అందులో 250మంది బీసీ విద్యార్థులు, 100మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకుంటున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది.
అర్హతలు
కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు చేసే నాటికి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్‌ఈ-260 లేదా జీమాట్-500 స్కోర్ కలిగి ఉండాలి. టోఫెల్-60 మార్కులు లేదా ఐఈఎల్‌టీఎస్-6.0 లేదా పీటీఈ-50 మార్కులు స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ http://www.telanganaepass.cgg.gov.inను సందర్శించాలని సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




