హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుని, చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ప్రజ్ఞానంద విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం క్రీడాకారులకు, యువతీయువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజ్ఞానంద మరెన్నో అద్భుతమైన విజయాలు సాధించి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





