హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సచివాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లక్ష్మణ్‌కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సచివాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఆయా శాఖల విభాగాధిపతులు, అధికారులు హాజరయ్యారు.
విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి అడ్లూరి
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి అడ్లూరి తన తొలి కార్యక్రమంగా గౌలిదొడ్డిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్‌లోని బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల వ్యవధిలోనే విద్యార్థులతో భోజనం చేసిన తొలి మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విద్య, వసతి, పోషణ తదితర