మహిళకు పని ఇప్పిస్తామని ఘాతుకం

– మెడలో బంగారం లాక్కుని బావిలో తోసేసి పరార్‌
‌- నిందితుడి కోసం పోలీసుల గాలింపు

కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌ ‌జిల్లాలోని తిమ్మాపూర్‌ ‌మండలం నుస్తులాపూర్‌ ‌గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక దుండగుడు ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని అర తులం బంగారాన్ని లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తన గుట్టు బయటపడుతుందని భావించి.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆమెను పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి తోసేసి అక్కడ నుంచి పరారయ్యాడు. బావిలో పడిపోయిన సదరు మహిళ సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. ఉదయం బావి వద్దకు వెళ్లిన యజమాని లోపల నుంచి శబ్దాలు రావడంతో గమనించగా,మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆయన వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని తాళ్లు, మంచం సహాయంతో ఆమెను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *