నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లే ప్రయత్నం

– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళల అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం 20మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మహిళలను ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. మహిళల దగ్గర నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. దీంతో 20మంది మహిళా ప్రయాణికులను ఔట్‌పోస్టు పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ వీసాలు ఎక్కడినుంచి తీసుకువచ్చారు, ఎవరు ఇచ్చారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *