రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– 136కు పైగా గొర్రెల మృత్యువాత

దేవరకొండ, ప్రజాతంత్ర, జూన్ 3: డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి  మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో 136 పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి చిట్టేగొండ ఎల్లయ్య (35) గుంటూరు జిల్లా నుండి డీసీఎం వాహనంలో గొర్రెలను ఎక్కించుకొని మంగళవారం తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన మరో వాహనాన్ని గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. 136 కు పైగా గొర్రెలు కూడా మృతిచెందాయి. డీసీఎం డ్రైవర్ రాము తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *