-చక్రాల కింద ఇరుక్కుపోయిన యువకుడు
– క్రేన్ సాయంతో విముక్తి.. హాస్పిటల్ కు తరలింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న శివ అనే ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో యువకుడు తన బైక్ సహా బస్సు ముందు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ బస్సును జరపడం సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్రేన్ను రప్పించి, బస్సును పక్కకు జరిపి, యువకుడిని బయటికి తీశారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





