– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. దిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర డిఫెన్స్ ఎగుమతులు గతంతో పోలిస్తే 103 శాతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 2030 నాటికి 5 గిగావాట్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతోనే గతేడాది ‘తెలంగాణ రైజింగ’ విజన్‌కు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అమలు చేస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించి పారిశ్రామికవేత్తలను ‘రైజింగ్ తెలంగాణ’ విజన్‌లో భాగస్వాములను చేసేందుకే దిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2.0లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





